telugu navyamedia
ట్రెండింగ్

కూల్ డ్రింక్ లో మందు కలిపి.. తాగితే.. ఆ కిక్కే వేరప్పా.. అంటున్న పాఠశాల విద్యార్థినిలు..

limit alcohol consumption by couple is fine

ఆల్కహాల్ తీసుకోవడం ప్రాణాంతకం.. అని ఉత్పత్తులపై స్పష్టంగా పేర్కొన్నాం..అయినా కొని తాగేవాళ్ళదే తప్పు; అమ్మే మాకు ఏమి సంబంధం లేదు అంటున్నట్టే ఉంది అటు ప్రభుతం కానీ, ఇటు అమ్మకం దార్లు కానీ. ఏది ఏమైనా నేటి కాలంలో మందు తాగటం ఒక సామజిక బాధ్యతగా భావిస్తున్నారు అందరూ. అది తాగకపోతేనే పెద్ద తప్పుగా చూస్తున్నారు. అందుకే నేడు ఇంటికి వెళితే చిక్కటి మజ్జిగో లేక తాగునీరో ఇవ్వకుండా, పెగ్గు మందేస్తున్నారు. ఇంతగా మన జీవితంలో కలిసిపోయాక, మన పిల్లలు మాత్రం మందు జోలికి పోకూడదని నియమం ఎందుకో..!!

అందుకే పిల్లలు కూడా తామేం తక్కువ తిన్నామా, సామజిక బాధ్యత నెరవేరుస్తున్నాం అంటున్నారు. అందుకే పాఠశాల స్థాయి నుండి ఇలాంటివి అలవాటూ చేసేసుకుంటున్నారు. దీనిని పెద్దలు ముందు జాగర్త అనుకోండి.. అన్నిటిలో ముందుండాలనుకునే పెద్దలు, దీనిలో మాత్రం .. నో .. చెప్పడం ఎందుకు! యధారాజా తథాప్రజ .. అన్నట్టు; ప్రభుత్వాన్ని మద్యం అమ్ముకోవచ్చని ప్రజలు చెప్పినంతకాలం.. పిల్లలకు తాగరాదు అని చెప్పే హక్కు కూడా బహుశా పెద్దలకు లేదేమో.

తాజాగా, ఒక పాఠశాలలో మందు తగినట్టు బాలికలపై ఆరోపణలు వచ్చాయి. విషయానికి వస్తే, ఆ బాలికలు కూల్ డ్రింక్ లో మద్యం కలిపి, పాఠశాలకు తీసుకోని వచ్చి, అప్పుడప్పుడు కాస్త సేవించడం చేశారు. దీనితో తూలుతున్న వారిని పక్క విద్యార్థులు భారిచలేక, ఉపాధ్యాయుడికి తెలిపారు. అది గమనించిన ఆయన, వారికి పరీక్షలు చేయించగా, మద్యం సేవించినట్టు నివేదికలలో తేలడంతో.. అంతా నివ్వెరపోయారు. దానిలో ఆశ్చర్యానికి గురవడానికి ఏముంది, పెద్దలు అమ్ముతున్నారు, ఇంట్లో వాళ్ళు తాగుతున్నారు.. వాళ్ళకి తాగాలనిపించింది, చేశారు. దీనికి ఎక్కడ చెక్ పెట్టాలో ఎవరి విజ్ఞత వారిది.

Related posts