బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు నిన్న సాయంత్రం శ్వాస తీసుకోవడంలో స్వల్ప ఇబ్బంది తలెత్తడంతో ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేరారు. కాగా సంజయ్ సన్నిహితులలో ఒకరు తెలిపిన వివరాల ప్రకారం… సంజయ్ ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. వైద్యులు సంజయ్ ఊపిరితిత్తుల నుండి నీటిని తీశారు. ప్రస్తుతం డాక్టర్ల పరిశీలనలో ఉన్న ఆయన సోమవారం డిశ్చార్జ్ అవుతారు. మార్చిలో లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుండి సంజయ్ భార్య మన్యత, ఆయన పిల్లలు దుబాయ్ లో ఉంటుండగా… ముంబై లోని తన నివాసంలో సంజయ్ ఒంటరిగా ఉంటున్నారు. కాగా “కెజిఎఫ్ 2″లో సంజయ్ దత్ విలన్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే.
previous post

