గత కొన్నేళ్లుగా బయోపిక్స్ సినిమాల హవా నడుస్తూనే వుంది. ప్రస్తుతం బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవిత కథ ఆధారంగా బయోపిక్ తెరకెక్కుతుంది. ఈ సినిమాలో సైనా నెహ్వాల్ పాత్రలో పరిణితీ చోప్రా నటిస్తోంది. అమోల్ గుప్తా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కోసం పరిణితీ చోప్రా బాడ్మింటన్ నేర్చుకుంటూ చాలానే కష్టపడుతుంది. కాగా, గతేడాది వేసవిలోనే ఈ సినిమాని విడుదల చేయాలనుకున్నా లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయింది. దాంతో అప్పుడు ఈ సినిమా ఓటీటీలో విడుదలవుతుందని టాక్ నడిచింది. కానీ ఇప్పుడు ఎట్టకేలకు ఈ థియేటర్లు తెరుచుకొని… సినిమాలు వరుసగా హిట్ అవుతుండటంతో మళ్ళీ ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చితబృందం ప్రకటించింది. ఈ సినిమా మార్చి26న విడుదల కానున్నట్లు మేకర్స్ ఓ పోస్టర్ విడుదల చేసారు. చూడాలి మరి ఈ సినిమా ఏ మేర ప్రేక్షకులను ఆకట్టుకుంటది అనేది.
previous post
next post


ఎన్నికలు అయి పోగానే ఉత్తమ్ పీసీసీ పోస్ట్ ఉడిపోతుంది: ఎమ్మెల్సీ రాజేశ్వర్రెడ్డి