మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పై నెటిజన్లు ప్రసంశలు కురిపిస్తున్నారు. విజయవాడలోని ‘అమ్మా ఆదరణ సేవా ఓల్డేజ్ హోమ్’ సదుపాయాలు లేక ఆదరణ కోసం ఎదురు చూస్తుండగా… తాను ఆదుకుంటానని మెగా హీరో గతంలో ముందుకు వచ్చాడు. దీంతో తన సొంత ఖర్చులతో వారి కోసం రెండు అంతస్థుల బిల్డింగ్‌ను నిర్మించి ఇచ్చి సాయి ధరమ్ తేజ్ తన మంచి మనసును చాటుకున్నాడు. ఇక సాయి ధరమ్ తేజ్ సినిమాల విషయానికి వస్తే… ప్రస్తుతం ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే సినిమాని చేస్తున్నాడు. ఇందులో సాయి ధరమ్ తేజ్ సరసన నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ద్వారా సుబ్బు అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. సాయి ధరమ్ తేజ్ తన 14వ సినిమాని దేవాకట్టా దర్శకత్వంలో, 15వ సినిమాని కార్తీక్ దండు దర్శకత్వంలో చేస్తున్నాడు. సుకుమార్ ఈ సినిమాకి కథను అందిస్తున్నాడు. మిస్టికల్ థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
previous post
next post

