టీఎస్ఆర్టీసీకి చెందిన ఓ బస్సు హైదరాబాద్ లో చోరీకి గురైంది. భద్రతా సిబ్బంది నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా మారిన ఈ ఘటన హైదరాబాద్ సీబీఎస్ లో చోటుచేసుకొంది. వివరాల్లోకి వెళితే మంగళవారం రాత్రి 11 గంటలకు బస్సును బస్టాప్ లో నిలిపిన డ్రైవర్, ఆపై విశ్రాంతి తీసుకునేందుకు వెళ్లారు. మరుసటి రోజు ఉదయం బస్సును తీసేందుకు వచ్చిన డ్రైవర్ కు బస్సు కనిపించలేదు. దీంతో
అఫ్జల్ గంజ్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తంగా లేకపోవడంతోనే బస్సు చోరీకి గురైందని పోలీసులు నిర్దారించారు. సీసీ కెమెరా దృశ్యాలన్నీ పరిశీలించి, ఈ బస్సు రాత్రి ఒంటిగంట సమయంలోనే తూప్రాన్ టోల్ గేటును దాటిందని గుర్తించారు. ఆపై ఇది నాందేడ్ వైపు వెళ్లిందని బస్సు ఎక్కడ ఉందో కనుగొనేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు.


మునుగోడు ప్రచారానికి వెళ్లను..పిలవని పేరంటానికి వెళ్లాల్సిన అవసరం లేదు