telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆర్ఆర్ఆర్ : ఎన్టీఆర్ హీరోయిన్ ట్వీట్… నిమిషాల్లోనే వైరల్

britan beauty with junior ntr in rrr movie

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌లలో “ఆర్ఆర్ఆర్” అనే భారీ బ‌డ్జెట్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. జూలై 30, 2020న విడుద‌ల కానున్న ఈ సినిమా షూటింగ్ 70 శాతం పూర్తైంద‌ని ఇటీవ‌ల మేక‌ర్స్ తెలిపారు. అయితే చిత్రంలో చ‌ర‌ణ్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా అలియా భ‌ట్‌, ఎన్టీఆర్‌కి జోడీగా ఓలివియా మోరిస్‌పై స‌నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చితాన్ని వచ్చే ఏడాది జూలై 30న విడుదల చేయబోతున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. జ‌న‌వ‌రి నుండి చిత్ర ప్ర‌మోష‌న్స్ మొద‌లు పెట్టాల‌ని జ‌క్క‌న్న భావిస్తుండ‌గా, సినిమాలోని పాత్ర‌ల‌ని ఒక్కొక్క‌టిగా విడుద‌ల చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. సినిమా మొద‌లైన‌ప్ప‌టి నుండి ఈ చిత్రం ఆర్ఆర్ఆర్ అనే పేరుతోనే ప్ర‌చారం జ‌రుపుకుంటుంది. ఇక ఒలివియా ఇప్ప‌టి వ‌ర‌కు ప‌లు టీవీ షోస్‌లో న‌టించ‌గా, తొలిసారి ఆర్ఆర్ఆర్‌తో వెండితెర‌కి ప‌రిచ‌యం అవుతుంది. ఎన్టీఆర్ స‌ర‌స‌న ఒలీవియా జ‌త‌క‌ట్ట‌నుంద‌ని రాజ‌మౌళి ప్ర‌క‌టించిన వెంట‌నే ఎన్టీఆర్ అభిమానులు ఆమె గురించి ఆరా తీయ‌డం మొద‌లు పెట్టారు. ఆమె సోష‌ల్ మీడియా అకౌంట్స్ కూడా ఫాలో అవుతున్నారు. అనౌన్స్‌మెంట్ రాక‌ముందు ట్విట్ట‌ర్‌లో ఒలీవియాకు కేవలం 300 మంది ఫాలోవర్లే ఉండేవాళ్లు. కాని ఇప్పుడు ఆమె ఫాలోవ‌ర్స్ సంఖ్య 22 వేలు దాటింది. తాజాగా ఆమె న్యూ ఇయ‌ర్ సంద‌ర్బంగా ఓ ట్వీట్ చేసింది. “హ్యాపీ న్యూ ఇయ‌ర్.. 2020 కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాను” అని ఆర్ఆర్ఆర్ హ్యాష్ ట్యాగ్ జ‌త చేసి ట్వీట్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ వైర‌ల్ అవుతుంది.

Related posts