telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రివర్స్ టెండరింగ్ పై టీడీపీ వాయిదా తీర్మాణం

TDP Change Puthalapattu Candidate

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆరో రోజు వాడి వేడిగా సాగుతున్నాయి. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. ఈ రోజు సభలో రివర్స్ టెండరింగ్ పై టీడీపీ నిరసన వ్యక్తం చేస్తోంది. మరోవైపు రివర్స్ టెండరింగ్ పై టీడీపీ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, 80 శాతం పూర్తైన ఇళ్ల నిర్మాణాలను కూడా ఆపేశారని విమర్శించారు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇళ్ల నిర్మాణాల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ వైఖరితో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేంత వరకు లబ్ధిదారులకు ప్రతి నెల రూ. 3 వేల చొప్పున అద్దె చెల్లించాలని కోరారు.

Related posts