telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు

ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర మంత్రిగా శ్రీ మహమ్మద్ అజారుద్దీన్ గారి పదవీ స్వీకార ప్రమాణ కార్యక్రమానికి హాజరయ్యారు.

రాజ్‌భవన్‌ దర్బార్‌ హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ గారు మహమ్మద్ అజారుద్దీన్ గారితో ప్రమాణం చేయించారు.

నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్ గారికి ముఖ్యమంత్రి గారు అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, శాసనసభ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారితో పాటు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.

Related posts