telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నిక లో నేడు రెండు చోట్ల రీపోలింగ్

పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. జడ్పీటీసీ ఎన్నికలో భాగంగా భారీ బందోబస్తు, ఎన్నో గొడవలు, అరెస్టులు చోటుచేసుకోవడం గమనార్హం.

ఎట్టకేలకు పలు ఉద్రిక్తల మధ్య పోలింగ్ ముగిసింది. కానీ రెండు చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

దీంతో ఆ చోట్ల రీపోలింగ్ జరుగుతుంది. 3, 14 కేంద్రాల్లో రీపోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్. సాయంత్రం 5గంటల వరకు సాగనుంది.

ఈ రెండు పోలింగ్‌ కేంద్రాల్లో దాదాపు వెయ్యి మంది ఓటర్లు ఉన్నారు. ఎంపీ అవినాష్‌ రెడ్డి ఫిర్యాదుతో ఈసీ రీపోలింగ్‌కి ఆదేశించింది. రేపు పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.

కాగా మంగళవారం పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఘర్షణలు, ఉద్రిక్తతల మధ్యే పోలింగ్ జరిగింది. పులివెందులలో 76.44శాతం, ఒంటిమిట్టలో 81.53శాతం పోలింగ్ నమోదైంది. రేపు కౌంటింగ్ జరగనుండడంతో గెలుపు ఎవరిదనే ఉత్కంఠ కొనసాగుతోంది.

ఈ రెండు స్థానాలను వైసీపీ, టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. పులివెందులను నిలబెట్టుకోవాలని వైసీపీ.. ఎలాగైన జగన్ కంచుకోటను బద్దలు కొట్టాలని టీడీపీ ప్రణాళికలు రచించాయి.

ఈ పార్టీల ప్రణాళికలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.

Related posts