రిజిస్ర్టేషన్ ధరల పెంపుకు ఏపీ సర్కార్ రంగం సిద్ధం చేసింది. ఏటా అమలుచేసే ఆగస్టు ఒకటో తేదీ నుంచి కాకుండా.. కరోనా నేపథ్యంలో ఆగస్టు 10వ తేదీ నుంచి ఈ పెంపును అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ, ఎక్సైజ్, రిజిస్ర్టేషన్ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌భార్గవ ఆదేశాలు జారీచేసినట్లు తెలిసింది.
ఇప్పటికే రిజిస్ర్టేషన్ల శాఖ విలువల పెంపుపై దాదాపుగా కసరత్తు పూర్తిచేసింది. ఏయే సర్వే నంబర్లు, ఏ ప్రాంతాల్లో ఎంతెంత విలువలు పెంచాలని నిర్ణయం తీసుకుంటారో తదితరాల వివరాలు రిజిస్ర్టేషన్ శాఖ వెబ్‌సైట్‌లో 15 రోజుల ముందే పెడతారు. దాన్ని ప్రజలు చూసుకోవచ్చు. అభ్యంతరాలు వ్యక్తమైన వాటిని మళ్లీ చార్జీల పెంపు కమిటీ ముందు పెట్టి, అప్పుడు తుది నిర్ణయం తీసుకుంటారు.

