telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

తిరుమలలో గురువారం నాడు రికార్డు స్థాయిలో శ్రీవారి భక్తులకు దర్శనం

తిరుమలలో గురువారం నాడు రికార్డు స్థాయిలో శ్రీవారి భక్తులకు దర్శనం అన్ని విభాగాల సమన్వయంతో సాధ్యమైంది అని అదనపు ఈఓ అన్నారు.

వేసవి రద్దీ నేపథ్యంలో తిరుమలలో గత వారం రోజులుగా భక్తుల తాకిడి పెరిగింది. సాధారణంగా గురువారం ఉదయం తిరుప్పావడ సేవ, సాయంత్రం పూలంగి సేవ ఉన్న కారణంగా భక్తులకు దర్శన సాధారణంగా రెండు మూడు గంటలు పైగా తగ్గుతుంది.

గురువారం నాడు సాధారణంగా కేవలం 62 నుండి 63 వేల మంది భక్తులు మాత్రమే శ్రీవారిని దర్శించుకుంటారు.

అయితే అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి నేతృత్వంలో, తిరుమలలోని అన్ని విభాగాలను ఎప్పటికప్పుడు సమన్వయపరుస్తూ, దాదాపు పదివేల మందికి పైగా భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగింది.

ఈ కారణంగా తొలిసారి గురువారం నాడు 72,579 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. ఇందుకు అదనపు ఈవో విశేష కృషి చేసిన అన్ని విభాగాల సిబ్బందిని అభినందించారు.

టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

Related posts