telugu navyamedia
వ్యాపార వార్తలు

వడ్డీరేట్లపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం!

sakthikanth as rbi new governor
సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా వ్యవస్థలోకి నగదు ప్రవాహాన్ని పెంచి వృద్ధిరేటును మెరుగుపరచాలన్న ప్రభుత్వ అభిప్రాయాలకు అనుగుణంగా ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్లపై నిర్ణయం తీసుకుంది. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ఆధ్వర్యంలో జరిగిన తొలి సమీక్ష సమావేశంలో యథాతథ నిర్ణయానికి  బ్రేక్‌ వేసి రేట్‌ కట్‌కు నిర్ణయించింది. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో కీలక వడ్డీరేట్లలో పావుశాతం కోత విధించింది భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ). ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆరో ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మొత్తం ఆరుగురు సభ్యులున్న ద్రవ్యవిధాన కమిటీ మానిటరీ పాలసీ కమిటీలో నలుగురు రేటు కట్‌కు ఆమోదం తెలిపారని శక్తి కాంత దాస్‌ వెల్లడించారు.  ఆర్‌బీఐ నిర్ణయం ఉంది.  
రెపో రేటును 25 బేసిస్‌ పాయింట్లు కట్‌ చేస్తూ ద్రవ్యవిధాన కమిటీ (ఎంపీసీ)  తీర్మానించింది. దీంతో  రెపో రేటు 6.50 శాతంనుంచి 6.25శాతానికి దిగి వచ్చింది.  అలాగే  బ్యాంకు రేటు 6.75 నుంచి 6.50 శాతానికి తగ్గింది. వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాలపై ఆర్బీఐ తీసుకునే వడ్డీరేటు ను 6.25 శాతంగా ఉంచింది. రివర్స్ రెపో  6.25శాతంనుంచి 6 శాతానికి తగ్గింది. దీంతోస్టాక్‌మార్కెట్లు పాజిటివ్‌ స్పందిస్తున్నాయి. బ్యాంకింగ్‌ షేర్లు భారీ లాభపడుతున్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో ద్రవ్యోల్బణం 3.2-3.4శాతంగా, ఆ తర్వాత మూడు నెలలు 3.9శాతంగా ఉంటుందని అంచనా వేసింది.

Related posts