telugu navyamedia
సినిమా వార్తలు

తార‌క్ సింహంలా ఉంటాడు…కొంచెం జాగ్రత్తగా ఉండాలి..

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న సినిమా ఆర్ ఆర్ ఆర్‌.. జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న‌ నేప‌థ్యంలో ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు మూవీ టీమ్‌.

ఈ క్ర‌మంలో సోమవారం చెన్నైలో ఆర్ఆర్ఆర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించారు. ఈ కార్యక్రమంలో శివకార్తికేయన్, ఉదయనిధి స్టాలిన్, ఆర్బీ చౌదరి, కలైపులి ఎస్.థాను ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న చరణ్ రామ్ చ‌ర‌ణ్ మాట్లాడుతూ ఈ ఈవెంట్ కి వచ్చిన వీరందరికి ధన్యవాదాలు.

ఈ సినిమా కోసం మేము చాలా కష్టపడ్డాము.. మా గురువు అనాలా.. మా హెడ్ మాస్టర్ అనాలా ప్రిన్సిపాల్ అనాలా.. నాకు ఇండస్ట్రీ ఫస్ట్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ అనాలా.. మా ఇద్దరినీ కలిపి సినిమా తీసినందుకు రాజమౌళి గారికి థాంక్స్.. ఆయన గురించి చెప్పడానికి ఒక స్టేజ్ సరిపోదు.. నాకు అవకాశం ఇచ్చినందుకు.. ముఖ్యంగా ఎన్టీఆర్ లాంటి బ్రదర్ ని ఇచ్చినందుకు రాజమౌళికి ఎంతో థాంక్స్. ఈ సినిమా కోసం పనిచేసిన అందరికి థాంక్స్. తమిళ్ డబ్బింగ్ చెప్పను అని చెప్పినా.. మాకు నేర్పించి డబ్బింగ్ చెప్పించిన మదన్ గారికి థాంక్స్..

ఇక నా ప్రియమైన మిత్రుడు.. నాకన్న వయస్సులో ఒక సంవ‌త్స‌రం పెద్దవాడు.. కానీ నిజ జీవితంలో.. మెంటాలిటీలో చిన్నపిల్లాడిలా ఉంటాడు .. చూడడానికి మాత్రం సింహంలా ఉంటాడు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ వ్యక్తితో.. నేను ముఖ్యంగా దేవుడికి థాంక్స్ చెప్పాలి. ఎందుకంటె ఇలాంటి బ్రదర్ ని నాకు దేవుడు ఇచ్చినందుకు..

ఈ సినిమా హిట్ అయితే ప్రొడ్యూసర్స్ తో పాటు మేము ఆనందపడతాము. నేను అంతకన్నా ఆనందపడిన విషయం ఎన్టీఆర్ లాంటి బ్రదర్ నాకు దొరికినందుకు.. నేను చనిపోయేవరకు తారక్ స్నేహం నా మనుస్సులో పెట్టుకుంటాను అని చ‌ర‌ణ్‌ ఎమోష‌న్‌ అయ్యారు.

అలాగే ‘నేను, తారక్ తమిళంలో డబ్బింగ్ చెప్పాలని రాజమౌళి పట్టుబట్టారు. నాకు చాలా భయం వేసింది. వేరే భాషలో మాట్లాడేటప్పుడు ఏదైనా తప్పు మాట్లాడితే ఏమైనా అనుకుంటారేమో అని నా భయం. కానీ మదన్ కార్కీ వల్ల డబ్బింగ్ సులభం అయింది. ఆయన ఒప్పుకుంటేనే ఆరోజు డబ్బింగ్ పూర్తయ్యేది. తారక్ చెప్పినట్లు అందరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అంటూ చ‌ర‌ణ్ స్పీచ్ ముగించారు.

Related posts