ఏపీలో రేపు రాజ్యసభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. నాలుగు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అసెంబ్లీ ప్రాంగణంలో పోలింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ ప్రారంభించి 6 గంటలకు ఫలితాలు వెల్లడిస్తారు.
రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి భద్రతా ఏర్పాట్లు చేయాలని అసెంబ్లీ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. ఈసారి రాజ్యసభ ఎన్నికల బరిలో వైసీపీ నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, పరిమళ్ నత్వాని, అయోధ్య రామిరెడ్డి ఉన్నారు. టీడీపీ నుంచి వర్ల రామయ్య బరిలో నిలిచారు.
పుచ్చిపోయిన పన్నుకి సింగపూర్ వెళ్లమని ఎవరు చెప్పారు?: యనమలపై రోజా ట్వీట్