యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతోన్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ ఆర్ ఆర్’ . దీనికి ‘రౌద్రం రుధిరం రణం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ పాన్ ఇండియా మూవీని తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. లాక్ డౌన్ తరువాత ఈ సినిమా షూటింగు మళ్లీ మొదలుకానుంది. ‘ఆర్ ఆర్ ఆర్’ తరువాత తన తదుపరి సినిమాను ఆయన మహేశ్ బాబుతో చేయనున్నాడు. ఈ మధ్యనే అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకోసం తన దగ్గరున్న స్టోరీ లైన్స్ ను రాజమౌళికి విజయేంద్ర ప్రసాద్ వినిపిస్తున్నారట. రాజమౌళికి లైన్ నచ్చితే అప్పుడు ఆ లైన్ ను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో విజయేంద్ర ప్రసాద్ వున్నారని అంటున్నారు. తన నుంచి ఇంతవరకూ రాని జోనర్లో కథ వుండాలనీ, మహేశ్ బాబు ఇంతవరకూ చేయని పాత్రై వుండాలని రాజమౌళి భావిస్తున్నారట. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ఆయన స్టోరీ లైన్స్ వింటున్నట్టు చెబుతున్నారు. ఇది కూడా పాన్ ఇండియా మూవీగానే రూపొందనుండటం విశేషం.
previous post
next post