‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బుట్టబొమ్మ పూజా హెగ్డే . టాలీవుడ్‌లో బ్యాక్-టు-బ్యాక్ హిట్ చిత్రాలు చేస్తూ ఒకదాని తర్వాత మరొకటిగా వరుసగా అవకాశాలు అందుకుంటోంది. ఇటు తెలుగు, తమిళంతోపాటు అటు బాలీవుడ్‌లోనూ వరుసగా ప్రాజెక్ట్‌లు ఓకే చేస్తూ.. స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు నటి పూజాహెగ్డే.
అంతేకాకుండా తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ చిట్‌చాట్ నిర్వహిస్తు నిత్యం ఫ్యాన్స్‌ను పలకరించే ఈ బుట్టబొమ్మ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో 15 మిలియన్ల ఫాలోవర్స్‌ను సంపాదించుకుంది. దీంతో పూజా సోషల్ మీడియా వేదికగా సంబరాలు చేసుకుంటోంది. తన హేర్ స్టైలిస్ట్, మేకప్ అర్టిస్ట్ కాజోల్, కుక్, అసిస్టెంట్, కుక్ అసిస్టెంట్స్‌లను కూడా తన సంతోషంలో భాగం చేస్తూ ఓ వీడియో షేర్ చేసింది.
దీనికి ‘ఇన్‌స్టాలో 15 మిలియన్ల ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నా క్రేజీ టీంను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. వీరంతా నన్ను నవ్విస్తారు, జాగ్రత్తగా చూసుకుంటారు. నేను అనారోగ్యం బారిన పడకుంటా చూసుకుంటుంటారు. అలాగే నేను అందంగా కనిపించేలా చేస్తారు’ అంటూ రాసుకొచ్చింది. అంతేగాక తను ఈ మైలు రాయి చేరుకోవడంలో సహాయం చేసిన ఫ్యాన్స్, ఫాలోవర్స్‌కు పూజా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపింది.
కాగా..తాజాగా ఆమె నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా విడుదలకు సిద్ధంగా కాగా.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన ‘రాధేశ్యామ్’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో పాటు తమిళంలో స్టార్ హిర్ విజయ్ సరసన నటిస్తోంది.
కంగనాపై కామెంట్స్ తో షాకిచ్చిన అలియా