telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆపరేషన్ గోల్డ్ ఫిష్ : ఆకట్టుకుంటున్న “వేక్ అప్” లిరికల్ వీడియో సాంగ్

Operation-Gold-Fish

ఆది సాయికుమార్ కథానాయకుడిగా, ప్రముఖ రచయిత అబ్బూరి రవి ప్రతినాయకుడిగా సాయికిరణ్ అడివి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ (ఒ.జి.యఫ్). ప్రతిభా అడివి, కట్ట ఆశిష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గ్యారీ.బి హెచ్, సతీష్ డేగల, ఆర్టిస్ట్స్ మరియు టెక్నీషియన్స్ నిర్మాత‌లు. సెన్సిబుల్ సినిమాలు ‘వినాయకుడు’, ‘విలేజ్‌లో వినాయకుడు’, ‘కేరింత’తో విజయాలు అందుకున్న సాయికిరణ్ అడివి, ఈసారి కాశ్మీర్ పండిట్ల సమస్యలను వెండితెరపై ఆవిష్కరించడానికి సిద్ధమయ్యారు. తీవ్రవాదం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. సెన్సార్ నుంచి యుబైఏ సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 18న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి “వేక్ అప్” అనే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు చిత్రబృందం. ఈ పాట నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. మీరు కూడా ఈ లిరికల్ వీడియో సాంగ్ ను వీక్షించండి.

Related posts