కేంద్ర హోం మంత్రిత్వశాఖ తాజాగా దేశంలోని పోలీసులు, కేంద్ర భద్రతా దళాలకు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఆయా కార్యాలయాల్లో దేశ మొట్టమొదటి హోంశాఖ మంత్రి, డిప్యూటీ ప్రధానమంత్రి సర్దార్ వల్లబ్భాయ్ పటేల్ చిత్రపటాన్ని ఉంచాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. పటేల్ చిత్రపటంతో పాటు మేము ఎల్లప్పుడూ భారతదేశ భద్రత మరియు ఐక్యతను చెక్కుచెదరకుండా ఉంచుతాం.. అనే సందేశాన్ని పెట్టాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. అక్టోబరు 31వతేదీన సర్దార్ పటేల్ జయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్రీయ ఏక్తా దివస్ ను జరపాలని కేంద్ర హోంశాఖ కోరింది.
జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు అనంతరం హోంశాఖ స్టాట్యూ ఆఫ్ యూనిటీ వద్ద ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. దేశం నలుమూలల నుంచి వేలాది మంది ప్రజలు పాల్గొననున్న ఈ ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలు పాల్గొని సర్దార్ పటేల్ జాతీయ సమగ్రతా అవార్డును ప్రదానం చేయనున్నారు. ఇకనుంచి దేశంలో స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవంలా పటేల్ జయంతిని కూడా నిర్వహించాలని హోంశాఖ నిర్ణయించింది.


ఇసుక విధానంపై ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలి: పురంధేశ్వరి