నేటి నూతన క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న కీలకనిర్ణయాలలో పార్లమెంట్ సమావేశాల తేదీలు ఖరారు చేయడం ఒకటి. కేంద్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో మరికొన్నిరోజుల్లో పార్లమెంటు సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. జూన్ 17 నుంచి జూలై 26 వరకు పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ క్రమంలో జూన్ 19న లోక్ సభ స్పీకర్ ఎన్నిక చేపడతారు. కేంద్రంలో మరోమారు ఎన్డీయే ప్రభుత్వం కొలువైన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ సహా 58 మందితో కేబినెట్ గురువారం రాష్ట్రపతిభవన్ లో ప్రమాణస్వీకారం చేసింది. కేబినెట్ సభ్యులకు ఇవాళ శాఖలు కూడా కేటాయించారు.

