telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

కాలేజీల ప్రారంభం మీద ఉన్నత విద్యా శాఖ సమావేశం…

students college

రాష్ట్రంలో మళ్లీ కాలేజీలు ఎప్పుడు ఓపెన్ అవుతాయి అన్న అంశం మీద తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 16 తర్వాత యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థల హాస్టల్స ప్రారంభం మీద ఉన్నత విద్యా శాఖ యూనివర్సిటీ అధికారులతో సమావేశం నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారం ఉన్నత విద్యాసంస్థల ప్రారంభం, సాధ్యా సాధ్యాల మీద చర్చించి ఒక రిపోర్ట్ ప్రభుత్వానికి పంపిస్తామని ఆయన పేర్కొన్నారు. ఆ తరువాత ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీదనే విద్యాసంస్థల ప్రారంభం అనేది ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. డిసెంబర్లో కూడా విద్యా సంస్థలు ప్రారంభం అవుతాయా లేదా అనే అంశాన్ని ఇప్పుడే చెప్పలేమని ఆయన అన్నారు. ఏదేమైనా కరోనా వ్యాప్తి నియంత్రించిన దాని మీదనే విద్యా సంస్థల ప్రారంభం ఉంటుందం లేదా అనేది ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే తాము నడుచుకుంటామన్న ఆయన కేవలం ప్రభుత్వానికి ఒక నివేదిక పంపడం వరకే మా బాధ్యత అని అన్నారు. కరోనా పరిస్థితులను బట్టి తుది నిర్ణయం తీసుకునేది ప్రభుత్వమే అని ఆయన తెలిపారు.

Related posts