telugu navyamedia
రాశి ఫలాలు

నవంబర్ 13 శనివారం రాశిఫలాలు..

మేషరాశి..

స్థిరచరాస్తులకు సంబంధించిన విషయాలలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు ఏర్ప‌డ‌తాయి. వాహనయోగం క‌లుగుతుంది. శుభవార్తలు వింటారు. పలుకుబడి కలిగిన వారి పరిచయాలు. వైద్యరంగంలోని వారికి ఏకాగ్రత ఎంతో ముఖ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం ల‌భిస్తుంది.

వృషభ రాశి…

సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహాయం అందుతాయి. వ్యవహారాలలో పురోగతి. సమస్యలు కొన్ని తీరతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలం. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.ఇంటా బయట మంచి మాట తీరుతో అందరిని ఆకట్టుకుంటారు.

మిథునరాశి..

ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు నిరాశ పరుస్తాయి. పనులు వాయిదా వేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు ఏర్ప‌డ‌తాయి. దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.పోస్టల్, కొరియర్ రంగాల వారికి పనిభారం అధికమ‌వుతాయి.

కర్కాటకరాశి..

వృత్తి వ్యాపారాలలో సొంత ఆలోచనలు కలిసిరావు. కుటుంబ సభ్యులతో ఆకారణంగా వివాదాలు కలుగుతాయి. అనారోగ్యం బారిన ప‌డ‌తారు. విద్యార్థులకు నిరుత్సాహం క‌లుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళంగా ఉంటుంది. ఖ‌ర్చులు ఎక్కువ‌వుతాయి.

సింహరాశి..

విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. పనులలో ముందుకు సాగుతారు. ఆత్మీయులతో విభేదాలు తొలగుతాయి. శుభ వార్తలు వింటారు. భూలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత సానుకూలత ఉంటుంది. దైవ కార్యాల‌యాల్లో పాల్గొంటారు.

కన్య రాశి..

వృత్తి వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు కలసివస్తాయి. బందువుల నుంచి శుభవార్తలు వింటారు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో విజయం ల‌భిస్తుంది. ఉపాధ్యాయులకు పనిభారం అధికమవుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం క‌లుగుతుంది.

తులరాశి..

చేపట్టిన పనులలో చిన్నపాటి అవరోధాలు తప్పవు. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. దూరప్రయాణాలు. పనులు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని సమస్యలు ఎదుర‌వుతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతాల నుండి అవకాశాలు లభిస్తాయి.

వృశ్చికరాశి..

బంధు వర్గం నుండి వ్యతిరేకత పెరుగుతుంది వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. వ్యవహారాలు ముందుకు సాగవు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

ధనుస్సురాశి..

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంతానం విద్యా ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. వ్యవహారాలలో విజయం. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ప్రోత్సాహకరంగా సాగుతాయి.

మకరరాశి..

వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు విశ్రాంతి లేకుండా చేస్తాయి. వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు ఎక్కువ‌వుతాయి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

కుంభరాశి..

సన్నిహితుల నుంచి ధనలబ్ధి కలుగుతుంది. ఆహ్వానాలు అందుతాయి. కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం మ‌ర్యాద‌లు ల‌భిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి.

మీనరాశి..

ఆరోగ్య విషయంలో వైద్యుల సంప్రదింపులు అవసరమవుతాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. పనులు మధ్యలో వాయిదా. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. స్థిరాస్తి వివాదాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు ఏర్ప‌డ‌తాయి.

Related posts