telugu navyamedia
రాజకీయ

డిసెంబర్ 13న కాశీ ఆలయ కారిడార్‌ ప్రారంభించనున్న ప్రధాని

ప్రధానమంత్రి నరేంద్రమోడీ డ్రీమ్ ప్రాజెక్టు కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభోత్సవ ముహుర్తం ఖరారైంది. డిసెంబర్ 13న తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో కాశీ విశ్వనాథ ఆలయ కారిడార్ ప్రాజెక్టును నిర్వాసితులైన 400 కుటుంబాలతో కలిసి ప్రధాని దీనిని ప్రారంభించనున్నారు. విశ్వనాథ్ కారిడార్ బహుమతిని ఇచ్చేందుకు ప్రధాని మోదీ రెండు రోజుల కాశీ పర్యటనకు రానున్నారు.

డిసెంబర్ 13న కాశీలో కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని , భారతదేశంలోని అన్ని ప్రధాన నదుల నీటితో కాశీ విశ్వ‌నాధుడుకు అభిషేకం చేస్తారని రాష్ట్ర బీజేపీ సోషల్ మీడియా కో-కన్వీనర్ శశికుమార్ తెలిపారు.

PM to inaugurate Kashi temple corridor on Dec. 13 - The Hindu

అంతే కాదు.. ఈ మహత్తర కార్యక్రమానికి 12 జ్యోతిర్లింగాల ప్రధాన అర్చకులను కూడా ఆహ్వానిస్తారు. శశికుమార్ తెలిపిన వివరాల ప్రకారం, కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రారంభోత్సవంలో, వారణాసిలోని అన్ని ప్రధాన ఘాట్‌లను దీపాలతో అలంకరించనున్న‌ట్లు తెలిపారు.

ఈ ప్రాజెక్ట్ ఆలయాన్ని ఆలయాన్ని గంగా ఘాట్‌లతో కలుపుతుందని, దీని కొలతలు 320 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు ఉండగలదని  తెలిపారు. కారిడార్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రారంభం కానుంది.

కాగా… 2018లో మోడీ రూ. 600(సుమారుగా) కోట్లుతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. అందులో రూ. 300 కోట్లు భూమిని, గుడి చుట్టుపక్కల ఉన్న భవనాలు వంటివి కొనడానికి, పరిహారాలు చెల్లించడానికి ఖర్చయిందని సమాచారం.

Related posts