ఓ బాలికను ప్రేమ పేరుతో నమ్మించి వెంకటేశ్ అనే యువకుడు రాత్రి పెళ్లి చేసుకొని ఉదయాన్నే పరారయ్యాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలంలో జరిగింది. బాధితురాలి కథనం ప్రకారం తాను ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నానని, ప్రతి రోజూ సైకిల్‌పై కళాశాలకు వెళ్లి రావడం గమనించిన ఆ యువకుడు పెళ్లి చేసుకుందామని నాలుగు నెలలుగా వెంటపడ్డాడని తెలిపింది.
గురువారం రాత్రి తాను తాత ఇంటి వద్ద ఉన్న విషయం తెలుసుకున్న అతను పెళ్లి చేసుకుందామని చెప్పి నమ్మించి గ్రామ సమీపంలోని కొండ వద్దకు తీసుకెళ్లి అక్కడి అమ్మవారి గుడిలో తాళి కట్టాడని పేర్కొంది. ఆ రాత్రి అక్కడే గడిపి ఉదయాన్నే తనని వదిలి పరారయ్యాడని తెలిపింది. జరిగిన విషయాన్ని తాను తల్లిదండ్రులకు చెప్పానని, వారి సూచన మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలియజేసింది.