telugu navyamedia
రాజకీయ వార్తలు

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో ఉంది

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టిస్తోంది.

ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతోంది.

ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సారథ్యంలోని మహాఘటబంధన్‌పై భారీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది.

తాజా సమాచారం ప్రకారం 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 122 మ్యాజిక్ ఫిగర్‌ను ఎన్డీఏ కూటమి ఇప్పటికే దాటేసింది.

ప్రస్తుతం ఎన్డీఏ 162 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, మహాఘటబంధన్ కేవలం 77 స్థానాలకే పరిమితమైంది.

తొలిసారి ఎన్నికల బరిలో దిగిన ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ‘జన్ సురాజ్’ పార్టీ రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉండి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

Related posts