దేశవ్యాప్తంగారోజు రోజుకీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండడంతో మళ్ళీ ప్రజల్లో తీవ్ర ఆందోళనలు మొదలయ్యాయి. సామాన్య ప్రజలనే కాకుండా సెలబ్రెటీలని సైతం కరోనా మహామ్మారి కలవరపెడుతుంది.
ఇప్పటికే కమల్ హాసన్, అర్జున్ కపూర్, కరీనా కపూర్, ఐటమ్ బ్యూటీ నోరా ఫతేహిలకు పాజిటీవ్ రాగా.. టాలీవుడ్ లో హీరో మంచు మనోజ్ కి కూడా కరోనా సోకింది.
ఇప్పుడు తాజాగా మహేష్ బాబు ఫ్యామిలీలోను కరోనా వైరస్ కలకలం రేపుతోంది. సూపర్ స్టార్ మహేశ్ సతీమణి నమ్రత సోదరి శిల్పా శిరోద్కర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించింది. గత నాలుగురోజుల నుంచి ఆమె కరోనాతో పోరాటం చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

‘ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండండి, దయచేసి టీకాలు వేసుకోని, అన్ని నియమాలను పాటించండి’ అంటూ ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేసింది శిల్ప. ఇక ఈ పోస్ట్ కి నమ్రతా స్పందిస్తూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని కామెంట్ పెట్టింది.

శిల్పా కూడా ఒకప్పటి బాలీవుడ్ నటి… “హమ్”, “ఖుదా గవా” మరియు “ఆంఖేన్” వంటి సినిమాలలో హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం ఆమె దుబాయ్లో నివసిస్తుంది.



నెపోటిజంపై అదాశర్మ కామెంట్స్