telugu navyamedia
తెలంగాణ వార్తలు

మునావర్ ఫారూఖీ కామెడీ షో అడ్డుకుంటాం : ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్

*మునావర్ ఫారూఖీ షో ను అడ్డుకొంటామ‌ని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌
*రాజాసింగ్ హెచ్చ‌రిక‌ల‌తో పోలీసులు అప్ర‌మ‌త్తం..
*ముంద‌స్తుగా రాజాసింగ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు

స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ షో ను అడ్డుకొంటామ‌ని గోషామహాల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చ‌రించారు. 

రేపు హైద‌రాబాద్‌ హైటెక్‌ సిటీలోని శిల్పకళా వేదికలో మునావర్‌ షోకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.  అయితే ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని మునావర్‌పై ఆరోపణలు వచ్చాయి.  ఈ నేపథ్యంలో ఆయన షోను అడ్డుకుంటామని ఎమ్మెల్యే ప్రకటించారు .

మునావర్‌ను వెంటపడి కొడతామమని బెదిరించారు. ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యతని హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు.

హైదరాబాద్‌లో ఎమ్మెల్యే నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు.. ముందస్తుగా ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యేను బయటకు రావొద్దని చెప్పినా వినలేదని దీంతో ఆయన్ను హౌజ్‌ అరెస్ట్‌ చేసినట్లు గోషామహల్‌ పోలీసులు వెల్లడించారు.

ఇక మాదాపూర్లోని డిసీపి కార్యాలయం దగ్గర కూడా పోలీసులు సెక్యూరిటీని టైట్ చేశారు.

 

 

Related posts