ఈనెల 29న శ్రీలంక కొత్త అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే భారత్ పర్యటనకు వస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి ఆహ్వానం మేరకు రాజపక్సే భారత్ పర్యటనకు వస్తున్నారు. అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత రాజపక్సే పర్యటించే మొదటి దేశం భారత్ కానుంది.
రాజపక్సే ప్రమాణస్వీకారం చేయగానే ఆయన్ను కలిసి అభినందించేందుకు భారత విదేశాంగ మంత్రి జై శంకర్ శ్రీలంక పర్యటనకు వచ్చారు. రాజపక్సేను కలిసి ప్రధాని మోడీ తరపున శుభాకాంక్షలు తెలిపారు. రాజపక్సేను ప్రధాని మోడీ భారత్‌కు ఆహ్వానించినట్లు జై శంకర్ ఆయనకు తెలపగా వెంటనే అంగీకరించారు.


బాబు టూర్ ముగిసేలోపే ఏపీ ముఖచిత్రం మారిపోతుంది: విష్ణువర్థన్‌రెడ్డి