ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్ సభ స్థానం  నుంచి  పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.  మోదీపై పోటీ చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రైతులపై మోదీ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ తెలంగాణలోని నిజామాబాద్‌కు చెందిన 40 మంది రైతులు వారణాసిలో నామినేషన్ వేసేందుకు వెళ్లారు. చివరికి ఎలాగోలా 25 మంది రైతులు నామినేషన్ వేసినా 24 మంది రైతుల నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. దీంతో ఒకే ఒక్క రైతు బరిలో మిగిలాడు. 
తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్టణానికి చెందిన ఓ యువకుడు కూడా మోదీపై పోటీ చేస్తున్నాడు. నగరంలోని విశాలాక్షి నగర్‌కు చెందిన మానవ్ ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగాడు. గత నెలలో ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ మానవ్  విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాడు.



కాంగ్రెస్‌కు ఓటేస్తే టీఆర్ఎస్కు వెళ్లే పరిస్థితులు: కిషన్ రెడ్డి