telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

మహారాష్ట్రలో కరోనా మహోగ్రరూపం.. పోలీసుల శాఖలో భయంభయం!

Maharashtra police corona

మహారాష్ట్రలో కరోనా మహోగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ అక్కడ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కరోనా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు వందల సంఖ్యలో మహమ్మారి బారినపడుతున్నారు. దీంతో పోలీసు శాఖలో కరోనా భయపెడుతోంది. గత 72 గంటల వ్యవధిలో 237 మంది పోలీసులు కరోనా బారినపడడం ఆందోళన కలిగిస్తోంది.

తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,040 మంది పోలీసులు కరోనా బాధితులుగా మారారు. అలాగే, ఇప్పటి వరకు 64 మంది పోలీసులు కరోనాతో మృతి చెందారు. పోలీసులకు వరుసగా కరోనా సోకడంతో విధులకు వెళ్లేందుకు ఖాకీలు జంకుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా  గత 24 గంటల్లో ఏకంగా 7,074 కేసులు నమోదయ్యాయి.  నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,00,064కు చేరుకుంది. మరణించిన వారి సంఖ్య 8,671కి పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 83,295 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నట్టు ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.

Related posts