గుంటూరు జిల్లాలో రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. సంక్రాంతి పండగ వేళ వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది.
పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి బాబాయ్ సుందరరామిరెడ్డి కుమారుడు మదనమోహన్‌రెడ్డి ప్రయాణిస్తున్న కారు సాగర్ కుడి కాలువలోకి దూసుకెళ్లింది. నీటిలో కారు మునగడంతో మదన్ మోహన్ రెడ్డి భార్య లావణ్య, కుమార్తె సుదీక్ష మరణించారు ..
సంక్రాంతి పండగకోసం విజయవాడలో షాపింగ్ చేసి మంగళవారం సాయంత్రం తిరిగి మాచర్ల వస్తుండగా దుర్గి మండలం అడిగొప్పల సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం మదనమోహన్‌రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.