*స్వాగత కార్యక్రమంలో ధర్మాన అసహనం..
*కార్యకర్తపై చేయిచేసుకున్న మంత్రి..
ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్ర అసహనానికి గురయ్యారు. స్వాగత కార్యక్రమంలో కార్యకర్తపై చేయిచేసుకున్నారు..
వివరాల్లోకి వెళితే..
మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి జిల్లాకు వచ్చిన ధర్మానకు మంత్రి పదవి వచ్చిన సందర్భంగా సిక్కోలు నేతలు అభినందన సభ నిర్వహించారు. అంతకుముందు భారీ ర్యాలీగా ధర్మాన సభా స్థలానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనతో కరచాలనం చేయటానికి కార్యకర్తలు ఎగబడ్డారు. ఓ కార్యకర్త చేయి పట్టుకొని వదలకపోవడంతో మంత్రి ధర్మానకు చిర్రెత్తుకొచ్చింది. సహనం కోల్పోయి ఆ కార్యకర్తపై చేయిచేసుకున్నారు.. ఈ ఘటనతో అక్కడున్న వైసీపీ కార్యకర్తలంతా ఆవాక్కాయ్యారు.