telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఐటీ దాడులపై ఎందుకు మాట్లాడటం లేదు: మంత్రి బొత్స

botsa ycp

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఎ.బి.వెంకటేశ్వరరావు పై ఏపీ ప్రభుత్వం సస్పెన్షన్‌ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఎ.బి సస్పెన్షన్ పై మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. చంద్రబాబు దగ్గర పనిచేసిన వాళ్లు అవినీతి చేసినా తాము చూస్తూ కూర్చోవాలా? అని ప్రశ్నించారు.

సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఐటీ దాడులపై ఎందుకు మాట్లాడటం లేదని టీడీపీ నేతలను ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో భయపడి దొంగలా పారిపోయి ఇక్కడికి వచ్చారని చంద్రబాబుపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వ్యాపారస్తులతో కలిసి నారాయణ కమిటీ వేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న అభివృద్ధి వికేంద్రీకరణ నిర్ణయంతో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.

Related posts