telugu navyamedia
తెలంగాణ వార్తలు

నాంపల్లి కోర్టు సంచ‌ల‌న తీర్పు : అక్బరుద్దీన్ విద్వేష వ్యాఖ్యల కేసు కొట్టివేత‌….

*అక్బ‌రుద్దీన్ హేట్ స్పీచ్ కేసులు కొట్టివేత‌..
*నాంప‌ల్లి కోర్టులో అక్బ‌రుద్దీన్ కు ఊర‌ట‌..

*మరోసారి ఇలాంటి రెచ్చగొట్టేలాంటి వ్యాఖ్యలు చేయోద్దు..
*పాత‌బ‌స్తీలో పోలీసులు అలెర్ట్‌..

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కి నాంప‌ల్లి కోర్టులో అక్బ‌రుద్దీన్ కు ఊర‌ట క‌లిగింది. విద్వేషపూరి వ్యాఖ్యల కేసుల్లో ఆయనను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.

2012 డిసెంబర్‌లో హిందువులను ఉద్దేశించి అక్బర్‌ తీవ్ర వ్యాఖ్యలుచేశారు. నిజామాబాద్, నిర్మల్‌లో చేసిన వ్యాఖ్యలపై ఒక వర్గం తీవ్రంగా స్పందించింది. ఆయన పై కేసులు నమోదయ్యాయి.

అక్బరుద్దీన్‌పై ఉన్న పదేళ్ల నాటి రెండు కేసులను సెషన్స్ జడ్జి కొట్టివేశారు. దాదాపు పదేళ్ల తర్వాత కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. కేసు కొట్టేసినంత మాత్రాన సంబరాలు చేసుకోవద్దని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.  

మరోసారి ఇలాంటి రెచ్చగొట్టేలాంటి వ్యాఖ్యలు మాట్లాడవద్దని కోర్టు అక్బరుద్దీన్ ను మందలించింది.  అవి దేశ సమగ్రతకు మంచిది కాదని, ఇదేదో విజయంలాగా భావించొద్దని కోర్టు పేర్కొంది.

మ‌రోవైపు ..అక్బ‌రుద్దీన్ తీర్పుతో పాత‌బ‌స్తీలో పోలీసులు అలెర్ట్ అయ్యారు.  కోర్టు ఆదేశాల‌కు అనుగుణంగా పాత బ‌స్తీలో సంబ‌రాలు, ర్యాలీల‌కు అనుమ‌తి లేద‌ని పోలీసులు తెలిపారు.నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు.

Related posts