telugu navyamedia
సినిమా వార్తలు

“ఇస్మార్ట్ శంకర్” వసూళ్ల వర్షం… 6 రోజుల్లో 56 కోట్లు

Ismart-shankar

ఎన‌ర్జిటిక్ హీరో రామ్, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన “ఇస్మార్ట్ శంక‌ర్” గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. “ఇస్మార్ట్ శంక‌ర్” చిత్రంలో రామ్ స‌ర‌స‌న నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించగా మణిశర్మ సంగీతం అందించాడు. జూలై 18న గ్రాండ్‌గావిడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుంటూ తొలి రోజే ఊహించ‌ని క‌లెక్ష‌న్స్ సాధించింది. పూరి జగన్నాథ్ స్టైల్ లో సాగే సైంటిఫిక్ మర్డర్ మిస్టరీ చిత్రం కాగా, మెమోరీ ట్రాన్స్‌ఫర్ అనే కొత్త అంశాన్ని టచ్ చేస్తూ ఈ చిత్రాన్ని హైదరాబాదీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించారు. చాలా రోజుల త‌ర్వాత ఇటు పూరీకి ఇటు రామ్‌ ఖాతాలో “ఇస్మార్ట్ శంక‌ర్”తో హిట్ పడింది. ఈ చిత్రం స‌రిగ్గా ఆరు రోజుల్లో 56 కోట్ల గ్రాస్ వ‌సూళ్ళ‌ని రాబ‌ట్టింది. వీకెండ్‌లోనే కాదు మాములు రోజుల‌లోను ఈ చిత్రంకి ప్రేక్ష‌కాద‌ర‌ణ మ‌రింత పెరుగుతూ పోతుంది. కొన్ని చోట్ల ఇప్ప‌టికి హౌజ్‌ఫుల్ బోర్డ్స్ ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. పూరీ మ్యాజిక్, రామ్ ప‌ర్‌ఫార్మెన్స్‌కి ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. చూసిన వారే మ‌ళ్ళీ మ‌ళ్ళీ థియేట‌ర్స్‌కి వెళుతుండ‌డం విశేషం. చాలా రోజుల త‌ర్వాత మాంచి మ‌సాలా ఎంట‌ర్‌టైన‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డంతో దీనిని ప్రేక్ష‌కులు బాగా ఆద‌రిస్తున్నారు. అయితే జూలై 26న డియ‌ర్ కామ్రేడ్ చిత్రం విడుద‌ల కానుండ‌డంతో ఇస్మార్ట్ శంక‌ర్ వ‌సూళ్ళ‌కి కాస్త బ్రేక్ పడే అవకాశం ఉందంటున్నారు సినిమా విశ్లేషకులు.

Related posts