telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రవితేజ ఆఫర్ ను తిరస్కరించిన మలయాళ బ్యూటీ

మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ తెలుగులో క్రేజీ ఆఫర్ ను వదులుకున్నట్టుగా తెలుస్తోంది. షారుఖ్ ఖాన్ ‘డాన్’ – మహేష్ బాబు ‘మహర్షి’ సినిమాలకు సినిమాటోగ్రఫీ అందించిన కేయూ మోహనన్ కూతురే ఈ మాళవిక మోహనన్. 2013లో వచ్చిన ‘పెట్టం పోలె అనే మలయాళీ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మాళవిక మోహన్. మాళవిక మోహన్ ప్రస్తుతం ‘ఇళయదళపతి’ విజయ్ – ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘మాస్టర్’ సినిమాలో నటిస్తోంది. అయితే ఇప్పుడు విషయమేమంటే… మాస్ రాజా రవితేజ హీరోగా ‘రాక్షసుడు’ సినిమా ఫెమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం రవితేజ గోపీచంద్ దర్శకత్వంలో క్రాక్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో పోలీస్ పాతరలో కనిపించనున్నాడు మాస్ రాజా . ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక రమేష్ వర్మ సినిమాలో హీరోయిన్ గామలయాళ బ్యూటీ మాళవిక మోహన్ అనుకున్నారు. కానీ ఈ ఆఫర్ ను అమ్మడు సున్నితంగా తిరస్కరించింది. ఇప్పట్లో తెలుగు సినిమాల్లో నటించే ఉద్దేశ్యం లేదని చెప్పుకొచ్చిందట. మాళవిక ప్రస్తుతం అంత బిజీగా ఏమీ లేదు. ఆమె చేతిలో ఉన్న ఒకే ఒక్క ప్రాజెక్టు ‘మాస్టర్’ కూడా ఇప్పటికే పూర్తయిపోయింది. ఈ నేపథ్యంలో క్రేజీ ఆఫర్ ఎందుకు వదులుకుంది అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Related posts