సూపర్ స్టార్ మహేష్ బాబు తన జన్మదినం (ఆగస్ట్ 9) సందర్భంగా ట్విట్టర్ ద్వారా మరో విజ్ఞప్తి చేశారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో ఒకరికొకరం తోడుగా ఉండటం ఎంతో అవసరం. కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్లాస్మా థెరపీ ప్రాణాలను నిలబెట్టడానికి ఎంతగానో ఉపయోగపడుతోంది. సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్‌గారు ప్లాస్మా డొనేషన్ ప్రాముఖ్యత ప్రజలందరికీ తెలియజేయడానికి ఎన్నో కార్యక్రమాలను చేస్తున్నారు. ఈ ఎవేర్నెస్‌తో ముందుకొచ్చి ప్లాస్మా డొనేట్ చేసిన వారిని అందరినీ అభినందిస్తున్నాను. సాటి మనుషుల ప్రాణాల్ని కాపాడడానికి దోహదపడే ప్లాస్మాను డొనేట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా నా బర్త్‌డే సందర్భంగా అభిమానులందరూ ప్లాస్మా డొనేషన్ ఎవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా ప్రజల్లో అవగాహన పెంచాలని, అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ప్లాస్మా డొనేట్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ప్లాస్మా డొనేషన్ ఎవేర్నెస్ ప్రోగ్రామ్‌ను పోలీస్ డిపార్ట్‌మెంట్ చాలా సమర్థవంతంగా నిర్వహిస్తోంది. ఎంటైర్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి అభినందనలు. ముఖ్యంగా అనుక్షణం ప్రజల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుంటూ, ఈ ప్లాస్మా డొనేషన్ గురించి ప్రజలకు చెబుతూ, ఎందరో ప్రాణాల్ని కాపాడుతున్న సిపి సజ్జనార్‌గారి కృషిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. కరోనా నుంచి కోలుకున్న వారు ముందుకొచ్చి ప్లాస్మా దానం చేయడం వల్ల మరెంతో మంది ప్రాణాలను కాపాడిన వాళ్లవుతారు. ప్లాస్మా డొనేట్ చేయడం.. ఇంకొకరి ప్రాణాలు నిలబెట్టండి.. మీ మహేష్ బాబు..’’ అని మహేష్ బాబు ఓ ప్రెస్‌నోట్‌ను విడుదల చేశారు.
Superstar @urstrulyMahesh appealed fans and COVID19 survivors to Donate Plasma. Appreciated the efforts of CP #Sajjanar
Interested plasma donors can call Cyberabad Police Covid Control Room Number 9490617440 & also register on https://t.co/vtBMhOypFq@cyberabadpolice @cpcybd pic.twitter.com/UthtNvUay7
— BARaju (@baraju_SuperHit) August 8, 2020

