ఖమ్మం జిల్లాలో నూతన సర్పంచులతో సమావేశమైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు.
ఇది పూర్తిగా “సర్వభ్రష్ట ప్రభుత్వం” అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు 30 శాతం కమిషన్లు దండుకుంటున్నారని, ఇక్కడ “30 శాతం ట్యాక్స్” రాజ్ నడుస్తోందని సంచలన ఆరోపణలు చేశారు.
ఎన్నికల సమయంలో మధిరలో భట్టి విక్రమార్క గ్యారంటీ కార్డులు పంచి, వంద రోజుల్లో హామీలు నెరవేరుస్తామని చెప్పారని గుర్తుచేశారు.
“వంద రోజులు పోయాయి రెండేళ్లు గడిచాయి ఇప్పుడు ఆ గ్యారంటీ కార్డులను ఎక్కడ పెట్టుకోవాలి?” అని సూటిగా ప్రశ్నించారు.
అలవిగాని హామీలిచ్చి, అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతలు ప్రజలను మోసం చేశారన్నారు.
జిల్లాలోని మంత్రులను ఉద్దేశించి “వీళ్లు ముగ్గురు మొనగాళ్లు కాదు ముగ్గురు మోసగాళ్లు” అని విమర్శించారు.
ఈ మోసగాళ్లకు పైన అసలైన నాయకుడు “అలీ బాబా” ఉన్నారు అని కేటీఆర్ అన్నారు .


చంద్రబాబుకు భద్రత తగ్గించామనడం సరికాదు: డీజీపీ గౌతమ్ సవాంగ్