మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నాయకురాలు పురందేశ్వరిపై వైకాపా మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నలుగురి కోసం గుడివాడలో రైల్వే గేట్లపై మంజూరైన ఫ్లైఓవర్లను అడ్డుకుంటారా అంటూ ఆయన విమర్శించారు.
సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉండటంతో ఆ పదవిని అడ్డంపెట్టుకుని ఫ్లై ఓవర్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని సీరియస్ అయ్యారు.
గుడివాడకు మంజూరైన ఫ్లై ఓవర్లను నలుగురు వ్యాపారుల కోసం పురంధేశ్వరి అడ్డుకోవడం దారుణమని నాని అన్నారు.
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ఎంపీ వల్లభనేని బాలశౌరిల కృషితో గుడివాడ ప్రజల సుదీర్ఘ సమస్య అయిన రైల్వే గేట్లపై ఫ్లైఓవర్లు మంజూరు అయ్యాయి. కేవలం ఒకరిద్దరు వ్యాపారులు ప్రయోజనాల కోసం లక్షలాది మందికి ఉపయోగపడే ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని అడ్డుకోవడం దారుణం.
ఫ్లైఓవర్ నిర్మాణం ఆగిపోతే గుడివాడ మీదుగా వెళ్లే రైళ్లను అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. పురందేశ్వరి పిచ్చి ప్రయత్నాలు మానుకోవాలి. ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని అడ్డుకుంటే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని కొడాలి నాని హెచ్చరించారు.
అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక నుండి అయినా పురందేశ్వరి పిచ్చి ప్రయత్నాలు మానుకోవాలని.. లేనిపక్షంలో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని కొడాలి నాని హెచ్చరించారు.

