telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

కవిత జ్యుడీషియల్ కస్టడీని జూలై 3 వరకు పొడగింపు

మద్యం పాలసీ కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కె.కవితకు ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కస్టడీని జూలై 3 వరకు పొడిగించింది.

కవిత కస్టడీ నేటితో ముగియాల్సి ఉంది. తీహార్ జైలు అధికారులు ఆమెను న్యాయమూర్తి కావేరీ భవేజా ముందు హాజరుపరిచారు.

కవిత భర్త అనిల్, వారి కుమారులు కూడా కోర్టుకు హాజరయ్యారు.

Related posts