telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మెగాస్టార్ తో మరోసారి జతకట్టనున్న చందమామ

Kajal

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్ లో’ ఆచార్య’ పేరుతో ఓ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి దేవాదాయ ధర్మాదయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. దీంతో రామ్ చరణ్ ఆ పాత్రలో మెరవనున్నాడని సమాచారం. మరోవైపు ఈ చిత్రంలో చిరు సరసన హీరోయిన్ గా త్రిష నటించాల్సివుండగా కొన్ని క్రియేటివ్ డిఫరెన్స్‌సెస్ వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా ధృవీకరించింది. ఉన్నట్టుండి త్రిష ఆచార్య సినిమా నుండి తప్పుకోవడంతో ఆమె స్థానంలో హీరోయిన్‌గా అందాల చందమామ కాజల్‌ని ఎంపిక చేసిందని ఓ వార్త హల్ చల్ చేసిన సంగతి తెసింది. కాగా తాజాగా వస్తోన్న సమాచారం  మేరకు ఆ వార్తల్ని నిజం చేస్తూ.. ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ ఖాయం అయ్యిందట. ఈ విషయాన్ని చిత్రబృందం తాజాగా ప్రకటించింది. కాగా గతంలో చిరంజీవి కాజల్ లు కలిసి ఖైదీ నెం 150లో నటించిన సంగతి తెలిసిందే. చాలా రోజుల తర్వాత చిరంజీవి సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఆచార్యను ఆగష్టు 14న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తోంది. రెజీనా కాసాండ్రా ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించనుంది.

Related posts