తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. మాయమాటలు చెప్పి రైతుల ఓట్లు వేయించుకుని కేసీఆర్ గెలిచారని చెప్పారు. ఆ గాలిలో ముక్కూమొహం తెలియని టీఆర్ఎస్ నేతలు కూడా ఎన్నికల్లో గెలిచారని అన్నారు. తాము 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటున్నామని అన్నారు.
తాము ప్రజలతో మమేకమైనప్పటికీ ఎన్నికల్లో ఓడిపోతున్నామని జగారెడ్డి చెప్పారు. దీనికి ఎన్నికలకు ముందు రైతుల కోసం కేసీఆర్ తీసుకొచ్చే పథకాలే కారణమని అన్నారు. రాష్ట్రంలో కౌలు రైతులకు ఎలాంటి ప్రోత్సాహం లేదని విమర్శించారు. రైతుల ఆత్మహత్యల్లో దేశంలో తెలంగాణ ఐదో స్థానంలో ఉందని చెప్పారు. కరోనాను కట్టడి చేయడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు.

