అడవి పందిని చంపబోయి ఓ వ్యక్తి పొరబాటున తన తండ్రిని తుపాకీతో కాల్చాడు. ఇటలీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం మార్టినో గాడియోసో (55) అనే వ్యక్తి తన 34 ఏళ్ల కొడుకుతో కలిసి అడవి పందిని వేటాడేందుకు పోస్టీగ్లియాన్ టౌన్ సరిహద్దు ప్రాంతాలకు వెళ్లాడు. వారిద్దరూ అడవి పందులు సంచరించే చోటుకు వెళ్లి అడవి పందిని తుపాకీతో కాల్చాలనుకున్నారు. ఇద్దరూ ఇరు వైపులకు వెళ్లి అడవి పందిని గాలిస్తుండగా.. కొడుకుకు దూరంలో ఓ నీడ కనిపించింది. అది అడవి పంది నీడ అనుకుని కొడుకు వెంటనే తుపాకీతో కాల్చాడు. దురదృష్టవశాత్తు ఆ నీడ తన తండ్రిదే అవడంతో మార్టినో గాయంతో అక్కడే కుప్పకూలిపోయాడు. కడుపు కింద బలమైన గాయం కావడంతో డాక్టర్లు మార్టినోను కాపాడలేకపోయారు.

