ఆదివారం జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతి చెందినట్లు ఆ దేశ అధికారులు ధృవీకరించారు.
సోమవారం ఉదయం హెలికాఫ్టర్ క్రాష్ అయిన చోటుని భద్రతా సిబ్బంది గుర్తించింది. ఆ ప్రమాదంలో ఆయనతో పాటు ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమిరబ్ధొల్లాహియాన్ కూడా మరణించారు.
క్రాష్ అయిన ప్లేస్ నిటారైన లోయ ప్రాంతం కావున అధికారులు, సిబ్బంది అక్కడికి చేరుకోలేకపోతున్నారు.
గాలింపు చర్యల కోసం 46 దళాలను రంగంలోకి దింపినట్టు ఐఆర్సీఎస్ పేర్కొంది.
ఇరాన్-అజర్‌బైజాన్ సరిహద్దుల్లో కిజ్ కలాసీ, ఖోదావరిన్ అనే రెండు డ్యామ్‌లను ప్రారంభించి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాద సమయంలో హెలికాఫ్టర్‌లో అధ్యక్షుడితో పాటు ఓ మంత్రి సహా మొత్తం తొమ్మిది మంది ఉన్నారు.
63 ఏళ్ల ఇబ్రహీం రైసీ తన రెండో ప్రయత్నంలో 2021 ఎన్నికల్లో గెలిచి ఇరాన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. నైతికత చట్టాలను మరింత కట్టుదిట్టం చేయడం, ప్రభుత్వ వ్యతిరేక గళాలను నిర్దాక్షిణ్యంగా అణచివేయడం, ప్రపంచ శక్తులతో అణుచర్చలు వంటి అంశాలతో ఇబ్రహీం రైసీ పాలన కొనసాగుతోంది.