మన దేశంలో కరోనా విజృంభిస్తునే వుంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 93 లక్షలు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. గడచిన 24 గంటలలో 43,082 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా… కరోనా వల్ల మొత్తం 492 మంది మృతి చెందారు. ఇక గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 39,379 డిశ్ఛార్జ్ అయ్యారు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 93,09,788 కాగా ….దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 4,55,555 ఉన్నాయి. ఇక కరోనా కు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 87,18,517కు చేరింది. “కరోనా” వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,35,715 నమోదైంది. ఇటు దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 93.65 శాతంగా ఉండగా… దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసులు 4.89 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.5 శాతానికి మరణాల రేటు తగ్గింది. ఇటు దేశవ్యాప్తంగా నిన్న ఒక్కరోజు నిర్వహించిన “కరోనా” టెస్ట్ ల సంఖ్య 11,31,204 కు చేరింది.
							previous post
						
						
					


అమరావతిలో వేల ఎకరాల భూములు కొన్నారు: విజయసాయిరెడ్డి