telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

మావంబెర్ : మగవారి కోసం ముందుకు సాగుతున్న ట్రస్ట్…

ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ట్రస్ట్ లు ఉన్న విషయం అందరికి తెలిసిందే. అందులో చిన్నపిల్లల కోసం ఆడవారి కోసం ఉన్నాయి. అయితే మగవారి కోసం కూడా ఓ ట్రస్ట్ ఉంది. అదే మావంబెర్. ఈ ట్రస్ట్ కేవలం నవంబర్ లో మాత్రమే ఫండ్ రైజ్ చేస్తుంది. అయితే 2004 లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వేదికగా దీనిని ప్రారంభించారు. ఆ తర్వాత 2007 లో సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, కెనడా, అమెరికా కు ఈ ట్రస్ట్ వ్యాప్తించి… ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా నడుస్తుంది. అయితే 2012 లో గ్లోబల్ జనరల్ మావంబెర్ ను ప్రపంచ వ్యాప్తంగా ఏ గవర్నమెంట్ సహాయం లేకుండా ముందుకు సాగుతున్న 100 ట్రస్ట్ ల ఒకటిగా గుర్తించింది. అయితే ఇప్పటివరకు ఈ ట్రస్ట్ ఫండ్స్ 8.37 మిలియన్ సేకరించి 1200 మందికి పైగా సహాయం చేసింది. ఈ ట్రస్ట్ ముఖ్యంగా… ప్రోస్టేట్ క్యాన్సర్, వృషణ క్యాన్సర్, మానసిక ఆరోగ్యం & ఆత్మహత్యల నివారణ పై పనిచేస్తుంది.

https://movember.com/m/malladi
https://ex.movember.com

అయితే ఈ ట్రస్ట్ లో మల్లాది ఉమామహేశ్వర రావు అనే తెలుగువారు కూడా ఒక భాగం. అమెరికాలో ఉంటున్న ఈయన గత ఎనిమిదేళ్లుగా ఈ ట్రస్ట్ కోసం ఫండ్ రైజ్ చేసారు. ఈయన. ప్రస్తుతం 8000 వేల డాలర్లకు  పైగా ఫండ్ రైజ్ చేసారు. అయితే ఈయన కేవలం ఈ మావంబెర్ లో మాత్రమే కాకుండా ఏకం, ఆశా-జ్యోతి, మనబడి 5కే రన్ ఇంకా ఇలాంటి చాలా వాటిలో పాల్గొనడం మాత్రమే కాకుండా… తన బంధువులు, మిత్రులు అందరితో ఈ పని చేయిస్తున్నారు. ఈ ట్రస్ట్ కోసం ఫండ్ కలెక్ట్ చేయడానికి కేవలం నవంబర్ నెలలో ఆయన తన షేవింగ్ మార్చుకొని మిగితా వారిలో చైతన్యం తీసుకొని రావడానికి ప్రయత్నిస్తుంటారు. మావంబెర్ అనగా నో షేవ్ నవంబర్ అని కూడా అర్ధం. మీరు కూడా ఈ ట్రస్ట్ కు ఫండ్ ఇవ్వాలి అనుకుంటే ఈ కింది లింక్స్ ఓపెన్ చేయండి.

https://movember.com/m/malladi

https://ex.movember.com

Related posts