telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సాంకేతిక

రానున్న మూడు రోజులు ఏపీ లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది: వాతావరణ శాఖ

రానున్న మూడు రోజులు రాష్ట్రంలో మేఘావృత వాతావరణంతో పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

శనివారం (31-05-2025) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం,అనకాపల్లి, కాకినాడ,కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,ఏలూరు,

పల్నాడు,ప్రకాశం, నెల్లూరు,కర్నూలు, నంద్యాల,అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

కృష్ణా,ఎన్టీఆర్, గుంటూరు,బాపట్ల, వైఎస్ఆర్ కడప, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

శుక్రవారం సాయంత్రం 5 గంటల నాటికి విజయనగరం జిల్లా గుర్లలో 87.5మిమీ, వైఎస్ఆర్ కడప జిల్లా సెట్టివారిపల్లిలో 87.5మిమీ, విజయనగరం జిల్లా వేపాడలో 79.2మిమీ, నంద్యాల జిల్లా ముత్యాలపాడులో 79మిమీ,అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 74మిమీ వర్షపాతం నమోదైంది.

Related posts