telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

30 కోట్ల మందికి వ్యాక్సిన్…

Corona

మన దేశంలో ప్రస్తుతం కరోనా కేసులు బాగానే వస్తున్నాయి. అయితే ఈ వైరస్ వ్యాక్సిన్ కోసం భారత్ తో పాటుగా చాలా దేశాలు ఎదురుచూస్తున్నాయి. అయితే మరో నాలుగైదు రోజుల్లో ఇండియాలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతున్నది.  కోవిషీల్డ్ వ్యాక్సిన్ కు అనుమతులు మంజూరు కాబోతున్నాయి.  అనుమతులు వచ్చిన వెంటనే వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది.  వ్యాక్సిన్ కు అనుమతులు వచ్చిన తరువాత ఎంతమందికి వ్యాక్సిన్ అందిస్తారు? ఎలా అందిస్తారు అన్నది ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది.  దేశంలో దాదాపుగా 30 కోట్ల మందికి వ్యాక్సిన్ అందిస్తామని భారతప్రభుత్వం తెలిపింది.  మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ? వారికి వ్యాక్సిన్ అవసరం లేదా అంటే అవసరమే.  కానీ, మొదట ప్రభుత్వంకరోనా ఫ్రంట్ లైన్ వర్కర్లు, ఇతర జబ్బులు ఉన్నవారు, పెద్దవయసు వ్యక్తులకు కరోనా వ్యాక్సిన్ అందిస్తారు.  దేశంలో కరోనాను ఎదుర్కొనే హర్డ్ ఇమ్మ్యూనిటి రావాలని, కరోనా వ్యాప్తిని ఆపడమే లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్రం ఇప్పటికే తెలిపింది.  భవిష్యత్తులో కరోనా నిల్వ సామర్ధ్యాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తామని కేంద్రం ప్రకటించింది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts