telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

హార్దిక్‌ పాండ్య నిశ్చితార్ధం .. కొత్త జంటకు ప్రముఖుల శుభాకాంక్షలు..

hardhik pandya engagement wishes

భారత యువ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య నిశ్చితార్ధం చేసుకున్నాడు. సెర్బియా నటి, నాచ్‌బేలియె పోటీదారు నటాషా స్టాంకోవిచ్‌ను త్వరలో పెళ్లాడనున్నాడు. సముద్ర జలాల్లో ఓ హ్యాచ్‌లో ప్రయాణిస్తూ పాండ్య తన ప్రియసఖికి ఉంగరం తొడిగాడు. ఆ తర్వాత ‘హెచ్‌పీ లవ్స్‌ నాట్స్’ అని రాసిన కేక్‌ను ఇద్దరూ కోశారు. ఆ తర్వాత తామిద్దరం నిశ్చితార్ధం చేసుకున్నామని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులకు తెలియజేశారు. ‘మై తేరా, తు మేరీ జాన్‌, సారా హిందుస్థాన్‌. 01.01.2020 #ఎంగేజ్‌డ్‌’ అని పాండ్య తన పోస్ట్‌కు జత చేశాడు. నటాషా సైతం ఉంగరం ధరించి తన ప్రేమికుడిని చుంబిస్తున్న వీడియోను పోస్ట్‌ చేసింది.

కొత్తజంటకు భారత సారథి విరాట్‌ కోహ్లీ, కుల్‌దీప్‌ యాదవ్‌, ధోనీ సతీమణి సాక్షి, అజయ్‌ జడేజా, కృనాల్‌ సతీమణి పంఖూరి శర్మ, సోఫీ చౌదరి, సోనాల్‌ చౌహాన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, ముంబయి ఇండియన్స్‌, మన్‌దీప్‌ సింగ్‌ తదితరులు అభినందనలు తెలియజేశారు. నటాషా చాలాకాలంగా ముంబయిలో నివసిస్తోంది. ప్రకాశ్‌ ఝా దర్శకత్వం వహించిన సత్యాగ్రహ చిత్రంతో తెరంగేట్రం చేసింది. బిగ్‌బాస్‌ (హిందీ 8)లో పోటీపడటంతో ఆమెకు క్రేజ్‌ పెరిగింది. అద్భుతమైన డ్యాన్సర్‌ అయిన నటాష ప్రస్తుతం వెబ్‌సిరీసులు, టీవీ షోలు, సినిమాల్లో పేరు తెచ్చుకుంటోంది. పాండ్య, నటాష సన్నిహితంగా ఉన్నట్టు ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. వారిద్దరూ ప్రేమలో పడ్డ, విందు, వినోదాలకు కలిసి వెళ్తున్న చిత్రాలు చాలాసార్లు వైరల్‌ అయిన విషయం తెలిసిందే.

Related posts