మొంథా తుఫాన్ నేపథ్యంలో 12 జిల్లాల్లో మంగళవారం నుంచి రేషన్ డిపోల ద్వారా వచ్చే నెలకు సంబంధించి 7లక్షల లబ్ధిదారులకు బియ్యం, పంచదార పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
ఏలూరు జిల్లాలో వరద పరిస్థితులను సమీక్షించేందుకు సోమవారం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. తుఫాన్ నుంచి ఎదురయ్యే విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
రానున్న నాలుగు రోజులకు పెట్రోలు, డీజిల్‌కు ఇబ్బందులు తలెత్తకుండా 3 ఆయిల్ కార్పొరేషన్లకు చెందిన 626 బంకుల ద్వారా 35,443 లీటర్ల పెట్రో నిల్వలను సిద్ధం చేశామన్నారు.
సమాచార వ్యవస్థకు విఘాతం తలెత్తకుండా మొబైల్ టవర్ల వద్ద జనరేటర్ల నిర్వహణను పౌరసరఫరాల శాఖే పర్యవేక్షిస్తోందని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రారంభమైందని, రైతులకు ఇబ్బంది లేకుండా ఆయా కొనుగోలు కేంద్రాల వద్ద 30వేల టార్పాలిన్లను సిద్ధం చేశామని మంత్రి మనోహర్ తెలిపారు.


సీఎం పదవి కోసం జగన్ రూ.1500 కోట్ల ఆఫర్: మాజీ సీఎం ఫరూక్