వివాద స్పద దర్శకుడు వర్మ ఈ మధ్య అమ్మాయిలతోను తెగ రచ్చ చేస్తూ వార్తల్లోకి ఎక్కేస్తున్నాడు. ఎప్పుడు ఏం చేస్తాడో, ఏలా స్పందిస్తాడో ఊహించడం కష్టం. మొన్నటికి మొన్న బిగ్ బాస్ భామ అరియానాతో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ తెగ వైరల్ కాగా దాని తరువాత మరో బుల్లితెర హాట్ యాంకర్ అషూ రెడ్డి తో ఆర్జీవీ చేసిన హంగామా సోషల్ మీడియాలో మరింత వైరల్ అయింది. అషూ రెడ్డి అందాలని తన కెమెరాలో బంధించేందుకు వర్మ పెట్టిన యాంగిల్స్, స్టెంట్స్ చూసిన నెటిజన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ఈ రెండు రచ్చలు మరవకముందే ఇప్పుడు అంతకుమించి అన్న రేంజ్లో మరో సెన్సేషన్ కి తెరలేపాడు. బర్త్‌డే జరుపుకుంటున్న ఓ అమ్మాయితో ఆయన ప్రవర్తించిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ‘లైఫ్ ఎట్ ఆర్జీవీ కంపెనీ’ ఫేస్బుక్ అకౌంట్లో షేర్ చేసిన ఈ వీడియోలో ..సినీ నటి జ్యోతి, శ్రీకాంత్ అయ్యంగార్ లు పక్కనుండగానే ఒక అమ్మాయితో కేక్ కట్ చేపిస్తూ వర్మ చేసిన పనులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఓ అమ్మాయి బర్త్‌డే వేడుకను సెలబ్రేట్ చేసుకోడానికి వర్మ ఆఫీసుకి వస్తే, ఆ అమ్మాయితో వర్మ కాస్త ఇబ్బందిగా ప్రవర్తించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కేక్ కట్ చేపిస్తూ ఆ అమ్మాయిని వెనక నుండి హత్తుకుని, కౌగిలింతలతో ముంచెత్తాడు వర్మ. ఇది చూసిన నెటిజన్స్ కొంతమంది నెటిజన్లు ఆర్జీవీపై మండిపడుతుండగా మరికొందరూ ‘మహానుభావుడు’ అంటూ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘మహానుభావుడు’ అంటూ తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
అంతేగాక ‘బతికితే వర్మలా బ్రతకాలి’, ‘వయస్సు పెరుగుతున్న కొద్ది వర్మ తుంటరి చేష్టలు మరింత పెరుగుతున్నాయి కానీ తగ్గడం లేదు’ అంటూ నెటిజన్ల నుండి కామెంట్స్ వస్తున్నాయి. ఇక ఈ వీడియోలో పంచ్ ఏంటంటే.. వర్మ తనతో అంత అసభ్యంగా ప్రవర్తిస్తున్నా ఆ అమ్మాయి మాత్రం వర్మ కంపెనీని తెగ ఎంజాయి చేసిన విడియో హాట్ టాఫిక్‌గా మారింది.